కేసీఆర్, కేటీఆర్‌లపై షర్మిల తీవ్ర విమర్శలు
ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుందని సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 21 Nov 2023 3:39 PM ISTఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుందని సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనోడికి.. 12 లక్షల దరఖాస్తులకు లక్ష ఇండ్లు కట్ట చేతకానోడికి.. మళ్లీ అధికారమిస్తే వడ్లు పండించినట్లు వరద పారిస్తడట.. చెప్పేటోనికి వినేటోడు లోకువ అన్నంట్లుంది కేసీఆర్ తీరు.. అని విమర్శించారు.
ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు ఎక్కడ? అని నిలదీస్తే.. చిన్న దొరకు జనం చెత్త నా కొడుకులు, సన్నాసులు లెక్క కనిపిస్తున్నారని.. అధికార మదంతో కళ్లు నెత్తికెక్కితే నిరుద్యోగులు సన్నాసుల్లా కనిపిస్తున్నారా కేటీఆర్ గారు.? అని నిప్పులు చెరిగారు. ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం అని మాట ఇచ్చిన సన్నాసులు నువ్వు.. మీ నాయన అంటూ కామెంట్ చేశారు. ఉద్యోగాలు నింపలేక పేపర్లు లీకులు చేసి అమ్ముకున్న పెద్ద సన్నాసివి నువ్వే.. కేజీ టూ పీజీ అని చెప్పి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన సన్నాసుల పాలన మీదని ధ్వజమెత్తారు.
నిరుద్యోగుల శవాల మీద ఇంతకాలం అధికారంలో కూర్చున్న మీకు.. ఓట్లు అడగడానికి ఇజ్జత్, మానం ఉండాలని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణలో ఇంటిల్లిపాది కొలువులు అనుభవించి.. అందిన కాడికి దోచుకొని.. మళ్లీ గెలిస్తే ఇండ్లిస్తాం, ఉద్యోగాలిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అనే వింత మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుంది.10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనోడికి,12 లక్షల దరఖాస్తులకు లక్ష ఇండ్లు కట్ట చేతకానోడికి మళ్లీ అధికారమిస్తే వడ్లు పండించినట్లు వరద పారిస్తడట. చెప్పేటోనికి వినేటోడు లోకువ అన్నంట్లుంది కేసీఆర్ తీరు.…
— YS Sharmila (@realyssharmila) November 21, 2023