48 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్న వైఎస్ షర్మిల

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో టీఎస్ పిఎస్సి పేపర్ లీక్, నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై

By అంజి  Published on  10 April 2023 3:00 PM GMT
YS Sharmila , unemployment, Telangana, YSRTP

48 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్న వైఎస్ షర్మిల 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో టీఎస్ పిఎస్సి పేపర్ లీక్, నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాజకీయాలు,సిద్ధాంతాలను పక్కన పెట్టి కలిసి పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం పోరాడటం మనందరి నైతిక భాధ్యత అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను కాపాడేందుకు 'టీ సేవ్ ఫోరం' ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు తర్వాత దాదాపు 3.85లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని షర్మిల అన్నారు.

కేసీఆర్ అసెంబ్లీలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రెండేళ్ల క్రితం చెప్పారని.. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని షర్మిల అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ క్వశ్చన్ పేపర్లనే లీక్ చేసిన వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు. టీఎస్పిఎస్సి మీద నమ్మకం పోయింది కాబట్టి వేరే బోర్డ్ వేసి తక్షణం నియామకాలు చేపట్టాలని షర్మిల డిమాండ్ చేసారు.

ఈ నెల 17న 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు షర్మిల తెలిపారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి సచివాలయ ముట్టడికి పిలుపు ఇద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పిన 2 కోట్ల ఉద్యోగాల విషయంలో తెలంగాణ యువతకి బీజేపీ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story