విద్యార్థుల‌ భ‌విష్య‌త్తును సీఎం ప‌ట్టించుకోవ‌డం లేదు : ష‌ర్మిల‌

YS Sharmila Fires on KCR.రాష్ట్రంలో విశ్వ‌విద్యాల‌యాలు అభివృద్దికి నోచుకోవ‌డం లేద‌ని వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 9:20 AM GMT
విద్యార్థుల‌ భ‌విష్య‌త్తును సీఎం ప‌ట్టించుకోవ‌డం లేదు : ష‌ర్మిల‌

రాష్ట్రంలో విశ్వ‌విద్యాల‌యాలు అభివృద్దికి నోచుకోవ‌డం లేద‌ని వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఆరోపించారు. విశ్వ విద్యాల‌యాల భూముల‌పై టీఆర్ఎస్ నేత క‌న్ను ప‌డిందంటూ విమ‌ర్శించారు. ప్ర‌తి మంగ‌ళ‌వారం రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు సంఘీభావంగా ష‌ర్మిల నిరాహారదీక్ష చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులో బాగంగా నేడు న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలోని మ‌హాత్మాగాంధీ విశ్వ‌విద్యాల‌యం ఎదుట దీక్ష‌లో ష‌ర్మిల పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ తీసుకువ‌స్తామ‌ని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చారని మండిప‌డ్డారు.

ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో 33 శాతం పోస్టుల ఖాళీలు ఉన్నాయ‌ని, రాష్ట్రంలోని ఇత‌ర ఏ వర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలు ఉన్నాయన్నారు. ఖాళీల‌ను ప్ర‌భుత్వం ఎందుకు భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అంద‌డం లేద‌ని.. విద్యార్థుల‌ భ‌విష్య‌త్తును సీఎం కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా? అని ష‌ర్మిల‌ ప్ర‌శ్నించారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలను కూడా కేసీఆర్ మోసం చేశార‌ని ష‌ర్మిల ఆరోపించారు.

Next Story
Share it