తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని షర్మిల డిమాండ్
తోట పవన్‌పై బీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు
By అంజి Published on 22 Feb 2023 11:32 AM GMTతెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని షర్మిల డిమాండ్
హైదరాబాద్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో యువనేత తోట పవన్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్‌పై బీఆర్‌ఎస్ గూండాలు చేసిన దాడిని ఆమె అభివర్ణిస్తూ.. బీఆర్‌ఎస్ నాయకులు “మృగాల” కంటే హీనంగా ఉన్నారని అన్నారు. ఆస్పత్రి వద్ద వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ''మానవత్వం లేని బీఆర్‌ఎస్ గూండాలు అడవి జంతువుల కంటే హీనంగా రాష్ట్రంపై పెత్తనం చెలాయిస్తున్నారు. రాష్ట్రంలో అక్షరాలా శాంతిభద్రతలు లేవని, ఈ దారుణానికి పాల్పడిన పోకిరీలపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ను విధి వదలిపెట్టదని, ఆయనకు, ఆయన పోకిరీలకు విధి తిరిగి చెల్లిస్తుందని అన్నారు. పవన్ తల్లిదండ్రుల బాధ వృథాగా పోదు'' అని అన్నారు.
తన పాదయాత్రపై షర్మిల మాట్లాడుతూ.. ''ధర్మపురి నుంచి నర్సంపేటకు, మహబూబాబాద్ నుంచి హుజూర్‌నగర్ వరకు ఈ గూండాల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాను. బీఆర్‌ఎస్ మాఫియా హయాంలో తెలంగాణలో పట్టపగలు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు రోజుకో అంశం వెలుగు చూస్తున్నాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు ప్రజల పక్షాన నిలబడాలని, బీఆర్‌ఎస్ ప్రైవేట్ సైన్యంలా ప్రవర్తించవద్దని మేము డిమాండ్ చేస్తున్నాము. పోలీసులు ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చేరారా అనే సందేహం మాకు ఉంది'' అని అన్నారు. "తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీని కోసం మేము రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తాము" అని షర్మిల తెలిపారు.
కాంగ్రెస్ యూత్ లీడర్ తోట పవన్ పై విచక్షణారహితంగా దాడి చేయడం క్రూరమైన చర్య. బీఆర్‌ఎస్ లీడర్లు మనుషులా? మృగాలా? పవన్ కోలుకోడానికి ఆరు నెలలు పడుతుందని డాక్టర్లు అంటున్నారు.ఆ తల్లి శాపం కేసీఆర్ కు తగులుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేక, పరిపాలన చేతకాక, ప్రతిపక్షాల ప్రశ్నలకు1/2 pic.twitter.com/FwwdaToejw
— YS Sharmila (@realyssharmila) February 22, 2023
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. రక్తం ఓడేలా చావ బాదుతారా? ప్రజల తరఫున ప్రశ్నిస్తే పాలకపక్షం ఇచ్చే బహుమతి ఇదేనా? సమాజానికి మీరు ఇస్తున్న సందేశం ఏంటి? ఇలాంటి రౌడీలు, గూండాలతో కేసీఆర్ దేశాన్ని ఏలుతారా? pic.twitter.com/ksVJE1HT7j
— YS Sharmila (@realyssharmila) February 22, 2023