విషాదం.. సెల్ఫీ దిగుతూ ప్రాజెక్ట్‌లో పడి యువకుడు మృతి
Youth drowns in Dindi reservoir while taking selfie. నల్గొండ జిల్లా డిండి రిజర్వాయర్ వద్ద శనివారం సాయంత్రం సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి 22 ఏళ్ల యువకుడు
By అంజి Published on 11 Sep 2022 1:48 PM GMTనల్గొండ జిల్లా డిండి రిజర్వాయర్ వద్ద శనివారం సాయంత్రం సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి 22 ఏళ్ల యువకుడు నీటిలో మునిగి చనిపోయాడు. డిండి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడిని ఎర్రగడ్డకు చెందిన యు.మనోజ్‌గా గుర్తించారు. మనోజ్ మరో ఆరుగురితో వచ్చినట్లు డిండి ఎస్ ఐ సురేష్ తెలిపారు. "అతను స్పిల్‌వే గేట్‌లకు చాలా దగ్గరగా వెళ్లి జారిపడ్డాడు. ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని నీటిలో నుండి బయటకు తీసుకువచ్చారు" అని అతను చెప్పాడు.
శనివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో మనోజ్ రిజర్వాయర్‌లో పడిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. "మేము అతని మృతదేహాన్ని వెంటనే గుర్తించడానికి ప్రయత్నించాము, కానీ చీకటి పడింది. మేము ఉదయం మృతదేహాన్ని బయటకు తీశాం" అని సురేష్ తెలిపారు. మనోజ్ అతని స్నేహితులు శ్రీశైలం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా డిండి వద్ద ఆగారు.
సెల్ఫీ మరణాలు
దాదాపు ఏడాది క్రితం నల్గొండకు చెందిన ఇద్దరు యువకులు డిండి జలాశయం వద్ద సెల్ఫీ తీసుకుంటూ మృతి చెందిన సంఘటన దాదాపు ఏడాది క్రితం జరిగింది.
మరొక సంఘటనలో, ఈ సంవత్సరం సెప్టెంబర్ 4న ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి రైల్వే ట్రాక్ నుండి కేవలం అంగుళాల దూరంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేయడానికి ప్రయత్నిస్తుండగా రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అజయ్‌గా గుర్తించారు.
వడ్డేపల్లి రైల్వే ట్రాక్‌పై రీల్‌కు బ్యాక్‌గ్రౌండ్‌గా Youth drowns in Dindi reservoir while taking selfieవేగంగా వస్తున్న రైలు చూపేట్టెందుకు విద్యార్థి ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తూ కెమెరాకు ఫోజులివ్వడానికి ప్రయత్నించడంతో ఈ దుర్ఘటన జరిగింది. అయితే స్టంట్ ఫెయిల్ కావడంతో రైలు ఢీకొనడంతో గాలిలో ఎగిరిపడ్డాడు. రైలు కాజీపేట నుంచి మంచిర్యాల వెళ్తున్నట్లు సమాచారం.
ట్రాక్‌పై రక్తంతో తడిసిన అజయ్‌ను గమనించిన రైల్వే గార్డు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అజయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతడి తలకు గాయం, ఎడమ చెవిపై గాయాలు ఉన్నాయి.