మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్‌లో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పూరి గొంతులో ఇరుక్కుని ఊపిరాడక యువకుడు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్(26) అదే మండలంలోని తిర్మలాపూర్‌లో ఓ వ్యక్తి పొలంలో గత కొంతకాలంగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. పొలం పనులు చేస్తున్న కుమార్‌కు పొలం యజమాని టిఫిన్ చేయడానికి పూరి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో పూరి తింటుండగా గొంతులో ఇరుక్కొంది. దీంతో కుమార్ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు.