కరోనా వ్యాక్సిన్ కోసం వెళితే.. కుక్క కాటు టీకా
Women get rabis vaccine instead of covid 19 vaccine.ఆ మహిళకు చదువు రాదు. కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2021 9:46 AM ISTఆ మహిళకు చదువు రాదు. కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లింది. కొవిడ్ వ్యాక్సిన్ వేయాలంటూ ఆమె పనిచేస్తున్న స్కూల్ హెడ్ మాస్టర్ రాసిచ్చిన లేఖను కూడా వెంట తీసుకెళ్లింది. అయితే.. ఆస్పత్రి సిబ్బంది ఆమెకు కుక్క కాటు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటన మంగళవారం నల్లొండ జిల్లా కట్టంగూరులో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్ట ప్రమీల పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది.
పాఠశాల ప్రధానోపాద్యాయుడి నుంచి లెటర్ తీసుకొని వ్యాక్సిన్ వేయించుకోవడానికి కట్టంగూరు పీహెచ్‌సీకివెళ్లింది. అయితే.. అక్కడ రెండు చోట్ల రెండు రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా.. పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల.. సాధారణ టీకాల క్యూలైన్‌లో నిలబడింది. ఆమె ముందు అయిటిపాముల గ్రామానికి చెందిన ఓ మహిళ ఉంది. నర్సు ఆ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) ఇచ్చింది. తర్వాత ప్రమీల వంతురాగా.. కరోనా వ్యాక్సిన్ వేయాలంటూ హెచ్‌ఎం ఇచ్చిన లెటర్‌ను నర్సుకు ఇచ్చింది. కానీ నర్సు ఆ లెటర్‌ను చదవకుండానే.. అదే సిరంజితో ప్రమీలకు ఏఆర్‌వీ వ్యాక్సిన్ వేసింది.
ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రమీల ప్రశ్నించడంతో.. నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. తనకు వేసింది కుక్కకాటు వ్యాక్సిన్ పక్కనున్న వారు చెప్పడంతో.. ప్రమీల భయాందోళనకు గురైంది. ఈ విషయమై వైధ్యాధికారి కల్పనకు వివరణ కోరగా.. బాధితురాలు కరోనా టీకా బ్లాక్‌లోకి కాకుండా, యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారు. ఆమెకు కుక్క కరిచిందని నర్సుపొరపాటుపడింది. ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలేదు. టీటీ ఇంజక్షన్ ఇచ్చాం. దాంతో ఎలాంటి ప్రభావం ఉండదు అని చెప్పారు.