భద్రాచలంలో మహిళ ఆత్మహత్య సెల్ఫీ వీడియో కలకలం

కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో మహాజన మహిళా సమైఖ్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు.

By -  Knakam Karthik
Published on : 15 Dec 2025 12:12 PM IST

Telangana, Bhadrachalam district, Alleged, Harassment, selfie video, Suicide attempt

భద్రాచలంలో మహిళ ఆత్మహత్య సెల్ఫీ వీడియో కలకలం

కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో మహాజన మహిళా సమైఖ్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె నిద్రమాత్రలు మింగడంతో చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒక వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం కొంతమంది దళిత సంఘాల నాయకులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది

ఒక మహిళకు అన్యాయం జరిగిందని ఆరోపించబడిన అంశంలో జోక్యం చేసుకున్నందుకు గుండె సుహాసిని, తోకల దుర్గా ప్రసాద్, ముద్ద పిచ్చయ్య, కనక శ్రీను మరియు టి రమణయ్య అనే వ్యక్తులు తనను వేధించారని లత ఆరోపించారు. స్థానిక పోలీసులకు కూడా ఈ విషయం తెలుసునని ఆమె చెప్పారు. తన మరణానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన భద్రాచలంలో తీవ్ర కలకలం రేపింది. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి ఇంకా తెలియలేదు.

Next Story