Telangana: ఆ మూడు జిల్లాలలో వైన్‌ షాపులు, బార్‌లు బంద్

ఎన్నికల పోలింగ్‌ జరిగే మూడు జిల్లాలలో వైన్‌ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్‌ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

By అంజి  Published on  24 May 2024 5:16 PM IST
Wine shops, bars , Warangal, Nalgonda, Khammam, election day

Telangana: ఆ మూడు జిల్లాలలో వైన్‌ షాపులు, బార్‌లు బంద్ 

ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రులు ఓటు వేయనున్నారు. ఎన్నికల పోలింగ్‌ జరిగే మూడు జిల్లాలలో వైన్‌ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్‌ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మే 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు, బార్‌లు బంద్ కానున్నాయి.

వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గంలో 4.6 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

నవంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ ఖాళీ ఏర్పడింది. పట్టభద్రుల నియోజకవర్గంలో 34 మంది ఎమ్మెల్యేలకు గాను 33 మంది అధికార పార్టీకి ఉన్నారు. మే 27న పోలింగ్ జరగనుండగా, లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు తర్వాత జూన్ 5న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Next Story