ఈ - కేవైసీ ఉంటేనే రూ.500కు సిలిండర్‌ ఇస్తారా?.. క్లారిటీ ఇదే

రూ.500కే సిలిండర్‌ ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ - కేవైసీ చేయించుకుంటేనే ఇది వర్తిస్తుందంటూ ప్రచారం జరిగింది.

By అంజి  Published on  25 Dec 2023 12:32 PM IST
Congress government, gas cylinder, eKYC

ఈ - కేవైసీ ఉంటేనే రూ.500కు సిలిండర్‌ ఇస్తారా?.. క్లారిటీ ఇదే

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 500 రూపాయలకే సిలిండర్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ - కేవైసీ చేయించుకుంటేనే ఇది వర్తిస్తుందంటూ ప్రచారం జరిగింది. ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే రూ.500 లకు సిలిండర్ ఇస్తారని, లేని వారు పూర్తి డబ్బులు కట్టాలనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వారంతా గ్యాస్ ఏజెన్సీల ఆఫీసుల ముందు బారులుతీరుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ - కేవైసీకి, రూ.500 సిలిండర్‌కు సంబంధం లేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. కేంద్ర ఉజ్వల పథకం కోసమే ఈ - కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మహాలక్ష్మి పథకంలో భాగమైన ఈ స్కీం అమలుకోసం పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిందని సమాచారం. రేషన్ కార్డు ఉన్నవారినే పథకంలో లబ్ధిదారులుగా గుర్తించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే సిలిండర్లను దుర్వినియోగం చేయకుండా బయోమెట్రిక్ తీసుకోవాలని కూడా పేర్కొన్నట్లు తెలిసింది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.3 నుంచి 4 వేల కోట్ల భారం పడుతుందని ప్రాథమిక అంచనా.

Next Story