ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం.. రైతును తొక్కి చంపిన ఏనుగు

తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఓ రైతును అడవి ఏనుగు తొక్కి చంపినట్లు అధికారులు తెలిపారు.

By అంజి
Published on : 4 April 2024 9:39 AM IST

Wild elephant, Telangana, Kumaram Bheem Asifabad district

ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం.. రైతును తొక్కి చంపిన ఏనుగు

తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఓ రైతును అడవి ఏనుగు తొక్కి చంపినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి పొరుగున ఉన్న మహారాష్ట్రలోకి ప్రవేశించిన ఏనుగుల మంద నుంచి విడిపోయిన ఏనుగు కౌటాల మండలం బూరేపల్లె గ్రామంలో వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది. రైతు అల్లూరి శంకర్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఏనుగు సంచరించడంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మగ ఏనుగు మహారాష్ట్రలోని గడ్చిరోలి మీదుగా చత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది. రెండు రోజుల క్రితం గడ్చిరోలి అడవుల్లోకి ప్రవేశించిన మందలో కొంత భాగం ప్రాణహిత నదిని దాటి తెలంగాణ గ్రామంలోకి ప్రవేశించింది.

మందతో మళ్లీ కలిసేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది పనిలో ఉన్నారని తెలిపారు. ప్రమాదకరమైన, ప్రాణహాని కలిగించే దాని దగ్గరికి వెళ్లడం రిస్క్ తీసుకోవద్దని ఆయన ప్రజలను అభ్యర్థించారు. అటవీశాఖ అధికారుల బృందాలు సురక్షిత దూరం నుంచి ఏనుగు కదలికను గమనిస్తూ దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు మృతుడి కుటుంబానికి అటవీశాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.

Next Story