ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి విషయంలో పలు విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా భార్య, అత్త అవహేళన కూడా చేశారని తెలుస్తోంది. డబ్బులు సంపాదించడం చేతకాదని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు రవి. 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్లాడాడు. రవి సంపాదన విషయంలో భార్యతో మనస్పర్ధలు తలెత్తాయి.
డబ్బు సంపాదించటం నీ వల్ల కాదంటూ భార్యతోపాటు అత్త కూడా హేళన చేయటాన్ని భరించలేక వెబ్ డిజైనర్‌గా తనకున్న అనుభవంతో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను సృష్టించాడు. తన సంపాదనను ఆధారాలతో సహా చూపినా అతనితో కలిసి ఉండేందుకు భార్య ఇష్టపడలేదు. దీంతో 2021లో ఇద్దరూ విడిపోయారు.
ఇక 50 లక్షల మంది డేటాను సైబర్ నేరస్థులు, గేమింగ్ ముఠాలకు విక్రయించి రూ.20 కోట్లు దాకా సంపాదించాడు. కూకట్‌పల్లిలోని ఫ్లాట్‌ను విక్రయించి వచ్చిన సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉండగా పోలీసులకు పట్టుబడ్డాడు.