యాదాద్రి భువనగిరి జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు వెలుతుండగా.. ఆకస్మాత్తుగా చక్రాలు ఊడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించడంతో పాటు సమయస్పూర్తిని ప్రదర్శించి బస్సును ఆపడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన యాద్రాది భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి వద్ద మోత్కూరు ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయపడ్డారు. బస్సు హైదరాబాద్ నుంచి తొర్రూర్ వెలుతోంది. బస్సుకు పిట్‌నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్ తెలిపారు. అనంతరం వేరే బస్సులో ప్రయాణీకులను గమ్యస్థానాలను పంపించారు. కాగా.. దీనిపై ప్రయాణీకులు మండిపడుతున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని.. లేకుంటే ఊహించడానికే కష్టంగా ఉందని పలువురు ప్రయాణీకులు అన్నారు. ప్రయాణీకుల ప్రాణాలతో చలగాటం ఆడొద్దన్నారు.