Telangana: భారీ గుడ్‌న్యూస్‌.. వీలైనంత త్వరగా వారికి ఫించన్ల పెంపు

దివ్యాంగుల ఫించన్‌ను 6 వేల రూపాయలకు వీలైనంత త్వరగా పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు.

By అంజి  Published on  28 Nov 2024 8:19 AM IST
pension, disabled, Minister Seethakka

Telangana: భారీ గుడ్‌న్యూస్‌.. వీలైనంత త్వరగా వారికి ఫించన్ల పెంపు

హైదరాబాద్‌: దివ్యాంగుల ఫించన్‌ను 6 వేల రూపాయలకు వీలైనంత త్వరగా పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్‌నే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తోంది. ముసలివారు, వితంతువులు, బీడీ కార్మికులకు రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తోంది.

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా.. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఫించన్‌ పెంపును ప్రస్తావించారు. అలాగే బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దివ్యాంగుల క్రీడల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story