హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే రోజు లక్ష రేషన్ కార్డులు అందించేందుకు మూహుర్తం ఖరారు చేసింది. కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి ఉద్దేశించిన విధి విధానాలు, మార్గదర్శకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా రేషన్ కార్డుల విషయమై రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు ఎక్స్ వేదికగా తెలిపారు.
ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఒకే రోజు లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మార్చి 8వ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇస్తామని చెప్పారు. పదేళ్ల తర్వాత పేద బిడ్డల కల నెరవేరుతోందని రాసుకొచ్చారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది. పైలట్ గ్రామాల వారిగా 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది.