పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: సీఎం రేవంత్‌

మహబూబాబాద్‌ జిల్లాలో నలుగురు మరణించడం బాధాకరమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

By అంజి  Published on  3 Sept 2024 4:30 PM IST
farmers, crops, CM Revanth, Telanganafloods

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: సీఎం రేవంత్‌

మహబూబాబాద్‌ జిల్లాలో నలుగురు మరణించడం బాధాకరమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు చెప్పారు. రైతులను ఆదుకుంటామని తెలిపారు. అధికారులు, పోలీసు సిబ్బంది నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొనడం వల్లే ప్రాణ నష్టం తగ్గిందన్నారు. కేంద్రం తక్షణమే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వర్షం తగ్గడంతో బురదను తొలగించే పనులు ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. తెలంగాణ జిల్లాల్లో నీటి వనరులను ఆక్రమించి నిర్మించిన వాటిని కూల్చివేసేందుకు హైడ్రా తరహా వ్యవస్థను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

''వరదలను ఎలా ఎదుర్కొన్నామో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను పోల్చి చూడండి. ఖమ్మం, కృష్ణా కవలలు, నష్టాలను పోల్చుకోండి, మేము చురుకుగా ఉన్నారా లేదా అనేది మీకే తెలుస్తుంది. మీరు మమ్మల్ని ఏపీ సీఎంతో పోలుస్తున్నారు కానీ ఈ సీఎం కూడా కంటిన్యూగా పర్యవేక్షిస్తున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత కూడా గ్రౌండ్‌లో ఉన్నారు, కానీ ఇక్కడ ఎందుకు లేరు ఉత్తరాఖండ్ అయినా, తెలంగాణ అయినా, విజయవాడ అయినా, హైదరాబాద్ అయినా ప్రకృతిని నాశనం చేస్తే ఆ కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో అక్రమ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఖమ్మం మాజీ మంత్రి ఆక్రమణల కారణంగా ముంపునకు గురైంది'' అని సీఎం రేవంత్‌ అన్నారు.

అటు ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఖమ్మంలో వరద నష్టం తగ్గేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇసుక మేటలు పెట్టిన ప్రాంతాల్లో రూ.50 వేల పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని హరీశ్‌ రావు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

Next Story