హైదరాబాద్ నుండి లక్షద్వీప్ వెళ్లాలనుకుంటున్నారా?.. ఈ పర్మిషన్‌ తప్పనిసరా

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నాయకులు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో భారతదేశం, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది.

By అంజి  Published on  14 Jan 2024 7:08 AM GMT
Lakshadweep, Hyderabad,  Maldives row, Agatti Island

లక్షద్వీప్‌లోని ఓ ఐలాండ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నాయకులు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో భారతదేశం, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం కారణంగా చాలా మంది భారతీయులు మాల్దీవ్స్‌ టూర్లను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది హైదరాబాద్ వాసులు సహా ప్రజలు లక్షద్వీప్‌కు వెళ్లే మార్గాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌మైట్రిప్ ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోడీ ద్వీపాన్ని సందర్శించినప్పటి నుండి లక్షద్వీప్‌కు సంబంధించిన శోధనలు 3400 శాతం పెరిగాయి.

హైదరాబాద్ నుండి లక్షద్వీప్ వరకు రవాణా మార్గాలు

హైదరాబాద్, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతమైన అగట్టి ద్వీపం మధ్య ప్రత్యక్ష రవాణా విధానం లేదు. హైదరాబాద్ నుండి ద్వీపానికి చేరుకోవడానికి వివిధ మార్గాల్లో హైదరాబాద్ నుండి బెంగళూరుకు, తర్వాత కొచ్చికి, చివరకు అగట్టి ద్వీపానికి విమానంలో వెళ్లొచ్చు. మరొక విమాన మార్గం.. హైదరాబాద్ మీదుగా కొచ్చికి ఆపై అగట్టి ద్వీపానికి కలుపుతుంది.

దీంతో పాటుహైదరాబాదు నుండి మంగళూరుకు బస్సులో, కొచ్చికి రైలులో, చివరగా, అగట్టి ద్వీపానికి విమానంలో చేరుకోవడం ద్వారా కేంద్రపాలిత ప్రాంతానికి చేరుకోవడానికి అత్యంత ఆర్థిక మార్గం. రైలు ప్రయాణంలో సౌకర్యంగా ఉన్నవారికి, హైదరాబాద్ నుండి ముంబైకి ఆపై కొచ్చికి రైల్వే ప్రయాణం, కొచ్చి నుండి అగట్టి ద్వీపానికి విమాన ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.

భారతీయులు లక్షద్వీప్‌లోకి ప్రవేశించడానికి అనుమతి అవసరం

హైదరాబాద్ నివాసితులు, లక్షద్వీప్‌కు చెందినవారు కాని వ్యక్తులందరూ దీవుల్లోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా అనుమతిని పొందాలి. ఈ పరిమితి ద్వీపాలలోని షెడ్యూల్డ్ తెగలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. పర్మిట్ దరఖాస్తును ePermit పోర్టల్‌లో ప్రాసెస్ చేయవచ్చు. అవసరమైన పత్రాలలో పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటోగ్రాఫ్, చెల్లుబాటు అయ్యే ఐడీ రుజువు యొక్క ఫోటోకాపీ (ఆధార్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి), ప్రయాణ రుజువు (విమాన టిక్కెట్లు లేదా బోట్ రిజర్వేషన్ వివరాలు), ఎంచుకున్న వసతి నుండి బుకింగ్ నిర్ధారణ ఉండాలి.

MakeMyTrip వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్ నివాసి లక్షద్వీప్ చేరుకోవడానికి కనీసం 7000 రూపాయలు ఖర్చు అవుతుంది.

Next Story