బీజేపీలో విజ‌య‌శాంతి చేరిక‌పై క్లారిటీ వ‌చ్చేసింది..!

Vijayashanti likely to join BJP soon .. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. అటు అధికార టీఆర్ఎస్‌, ఇటు

By సుభాష్  Published on  28 Nov 2020 12:39 PM GMT
బీజేపీలో విజ‌య‌శాంతి చేరిక‌పై క్లారిటీ వ‌చ్చేసింది..!

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. అటు అధికార టీఆర్ఎస్‌, ఇటు బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్న‌ట్లు ప్రచారాల‌తో హోరెత్తిస్తున్నాయి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని ఇరు పార్టీలు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి. ఇక బీజేపీ అయితే.. దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన విజ‌యంతో ముందుకు సాగుతోంది. జాతీయ స్థాయి నేతల‌‌ను రంగంలోకి దించుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు కేంద్ర మంత్రులు హైద‌రాబాద్ వ‌చ్చి గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పార్టీలకు షాక్‌ ఇస్తూ ఆపార్టీ నేత‌ల‌ను ఆహ్వానించి క‌షాయ కండువాలు క‌ప్పుతోంది క‌మ‌లం పార్టీ. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కొందరు బీజేపీ గూటికి చేరుకోగా.. మరికొందరు త్వరలోనే చేరిక ఉంటుందని ప్రకటించారు. తెరాసాకు షాక్ ఇస్తూ స్వామిగౌడ్‌ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. గ‌త కొన్నాళ్లుగా కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి అలియాస్ రాములమ్మ బీజేపీలో చేరుతార‌ని ప్ర‌చారం సాగుతోంది. దీనిపై ఇప్ప‌టికే కొంద‌రు నేతలు క్లారిటీ ఇస్తూ.. ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగినా.. ఇంత వ‌ర‌కు అలాంటిది ఏమీ జ‌ర‌గ‌లేదు.

అయితే.. బీజేపీలో రాముల‌మ్మ చేరికపై క్లారిటీ వచ్చింది. గ్రేటర్ ప్రచారం కోసం హైదరాబాద్‌ వచ్చిన జేపీ నడ్డాను శుక్రవారం రోజు తాజ్‌కృష్ణలో కలిసి విజయశాంతి చర్చలు జ‌రిపార‌ని తెలుస్తోంది. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదివారం గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రానుండగా.. షా సమక్షంలో బీజేపీ తెలంగాణ కార్యాలయంలో విజయశాంతి కాషాయ కండువా కప్పుకోనున్నార‌ట‌. సో రేపు విజ‌యశాంతి బీజేపీ గూటికి చేరుతార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Next Story