Video: దళిత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘోర అవమానం: బీఆర్‌ఎస్‌

యాదాద్రీశుడి సాక్షిగా దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్‌ఎస్‌ విమర్శించింది.

By అంజి  Published on  11 March 2024 8:17 AM GMT
Telangana, CM Revanth, Dalit deputy CM, Bhatti vikramarka

Video: దళిత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘోర అవమానం: బీఆర్‌ఎస్‌

యాదాద్రీశుడి సాక్షిగా దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్‌ఎస్‌ విమర్శించింది. యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీటలపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖకు మాత్రం కాస్త ఎత్తు తక్కువ ఉన్న పీటలు వేశారు. మల్లు భట్టి విక్రమార్కను అవమానించారని అధికార కాంగ్రెస్‌ను నిందిస్తూ ఓ వీడియోను భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్ పార్టీ) ఎక్స్‌లో షేర్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన డిప్యూటీతో సహా మంత్రులు భువనగిరి జిల్లాలోని యాదాద్రి దేవాలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పూజారులు మంత్రాలు జపిస్తున్నప్పుడు కొంతమంది మంత్రులు దేవుడికి ఎదురుగా ఉన్నట్లుగా స్టూల్‌పై కూర్చున్నట్లు వీడియో చూపిస్తుంది. అయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాత్రం తక్కువ ఎత్తు ఉన్న పీటపై కూర్చున్నారు. యాదాద్రి ఆలయ దర్శనానికి వచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సహచరులు దారుణంగా అవమానించారని, రేవంత్‌రెడ్డి, సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పైన కూర్చొని భట్టి విక్రమార్కను అవమానించారని బీఆర్‌ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి, కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీని గద్దె దించి తెలంగాణ తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story