ఇంట్లోకి చొరబడ్డ దొంగతో మహిళ వీరోచిత పోరాటం.. వీడియో వైరల్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది.

By అంజి  Published on  15 Aug 2023 10:10 AM IST
Vemulawada, woman fight robber, crime, Rajanna Sirisilla

ఇంట్లోకి చొరబడ్డ దొంగతో మహిళ వీరోచిత పోరాటం.. వీడియో వైరల్‌

తెలంగాణాలో జరిగిన దొంగతనానికి సంబంధించిన ఓ వీడియో కలకలం రేపింది. ఆగస్ట్ 13, ఆదివారం తెల్లవారుజామున తన ఇంటి ఆవరణలో దొంగతో ఓ మహిళ ధైర్యంగా పోరాడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో త్వరగా ట్రాక్షన్ పొందిన ఫుటేజ్‌లో, తెల్లటి దుస్తులు ధరించినట్లు కనిపించే దొంగ, చేతిలో కత్తితో మహిళపై విరుచుకుపడటం చూడవచ్చు.

ఒంటరిగా నివసిస్తున్న 40 ఏళ్ల మహిళ అతడికి ఎదురు తిరిగింది. అతడు కత్తితో పొడిచే ప్రయత్నాలను ఆమె ప్రతిఘటించింది. వీలైనంత వరకు అతన్ని గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. అయితే ఆ దొంగ ఆమె బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. మహిళ వద్ద నుంచి 7 గ్రాముల బంగారు గొలుసును దొంగ దోచుకెళ్లినట్లు వేములవాడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. వేములవాడ భగవంతరావు నగర్‌లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది.

ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు. ఆదివారం రాత్రి శ్రీలత ఇంట్లోకి ఓ దుండగుడు దొంగతానికి వచ్చాడు. ఇంటి ముందు చప్పుడు కావడంతో శబ్దాలకు ఆమె బయటకు వచ్చి చూసింది. ఇంటి ఆవరణలో చీకట్లో నక్కిన ఆగంతకుడు మహిళను చూసి రాడ్‌తో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించాడు. శ్రీలత తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. సదరు దొంగ ఆమె మెడలో నుంచి బంగారం అపహరించాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story