నా నాలుకపై నల్ల మచ్చలు.. భవిష్యత్‌లో ఉత్తమ్‌కుమారే సీఎం: కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం అవుతారని రాజగోపాల్‌ రెడ్డి జోస్యం చెప్పారు.

By అంజి  Published on  30 Aug 2024 5:22 PM IST
Uttam Kumar Reddy, Chief Minister, Rajagopal Reddy, telangana

నా నాలుకపై నల్ల మచ్చలు.. భవిష్యత్‌లో ఉత్తమ్‌కుమారే సీఎం: కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం అవుతారని రాజగోపాల్‌ రెడ్డి జోస్యం చెప్పారు. ఓ సభలో ఉత్తమ్‌ను ముఖ్యమంత్రి గారూ అని ఆయన సంబోధించారు. గతంలోనే ఉత్తమ్‌కు సీఎం పదవి కొద్దిలో మిస్‌ అయ్యిందని, ఈ సారి మాత్రం పక్కాగా ఆయనకే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని అన్నారు. తన నాలుకపై నల్లమచ్చలు ఉన్నాయని, తాను ఏదంటే అది జరిగి తీరాల్సిందేనని రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలో నీటి పారుద‌ల పనుల‌పై భువ‌న‌గిరిలో స‌మీక్ష స‌మావేశం జరిగింది. ఈ స‌మావేశంలో రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. న‌ల్ల‌గొండ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, భ‌విష్య‌త్‌లో త‌ప్ప‌నిస‌రిగా సీఎం అవుతారని అన్నారు. బునాదిగాని పిల్లయిపల్లి ధర్మారెడ్డి కాలువలను రీ డిజైన్ చేయాలని కోరారు. కాలువల వెడల్పు పెంచాలని, దీని ద్వారా ఆయకట్టు రెట్టింపు అవుతుంద‌న్నారు. అధికారులు దూర‌దృష్టితో ప్రతిపాదనలు పంపాల‌ని ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ఆదేశించారు.

Next Story