రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు కరోనా టీకా తీసుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఈ ఉదయం ఆయన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వేయించుకున్నారు. వైద్య సిబ్బంది ఆయనకు టీకా ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని కోరారు. టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ప్రధాని మంత్రి సహా పలువురు టీకా తీసుకున్నారన్నారు. 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ సెంటర్లలలో కొవిడ్ వ్యాక్సిన్ ఉచితమని.. ప్రైవేటు లో అయితే.. రూ.250 కన్నా ఎక్కువ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 10వేల ఫ్రీ వ్యాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని త్వరనేలో వాటిని 20వేలకు పెంచుతామని పేర్కొన్నారు. తెలంగాణలో 91 కేంద్రాల్లో వాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయని.. ఇందులో ప్రభుత్వ కేంద్రాలు 45 ఉన్నాయన్నారు. కాగా.. కిషన్‌రెడ్డి టీకా తీసుకుంటున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయన పక్కనే ఉన్నారు. ఈటల నిన్ననే వ్యాక్సిన్ వేయించుకున్న విషయం తెలిసిందే.