కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డికి క‌రోనా

Union Minister Kishan Reddy tests covid positive.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజువారి పాజిటివ్ కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jan 2022 9:37 AM GMT
కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డికి క‌రోనా

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌లు దాటింది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులకు ఈ మ‌హ‌మ్మారి సోకింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, భానోత్ శంక‌ర్ నాయ‌క్‌లు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌గా.. తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి సైతం క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. ఇక ఇటీవ‌ల తనను కలసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించ‌డంతో పాటు కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌న్నారు.

Next Story
Share it