బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ తన సమాధానంలో, కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులో చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు అబద్ధమని, నిరాధారమని పేర్కొన్నారు. తన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ పేరును తాను ఎప్పుడూ తీసుకోలేదని సంజయ్ స్పష్టం చేశారు.
నిరాధార ఆరోపణలు చేసినందుకు కేటీఆర్.. మీడియా ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లీగల్ నోటీసును 7 రోజుల్లో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ సేవించి 'ఫోన్ ట్యాపింగ్'కు పాల్పడ్డారంటూ తప్పుడు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్‌కు అక్టోబర్ 23న కేటీఆర్ పరువు నష్టం నోటీసు పంపారు.