'అలా అనడం ప్రజలను అవమానించడమే'.. కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ ధ్వజం

కాంగ్రెస్‌ వాళ్లది బిచ్చగాళ్ల బతుకంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు.

By అంజి
Published on : 26 Aug 2025 11:36 AM IST

Union Minister Bandi Sanjay, Congress leaders, Telangana

'అలా అనడం ప్రజలను అవమానించడమే'.. కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ ధ్వజం

కాంగ్రెస్‌ వాళ్లది బిచ్చగాళ్ల బతుకంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. ''ఓట్ల కోసం ముస్లింల వద్దకు వెళ్లి టోపీలు పెట్టుకొని నమాజ్‌ చేస్తారు. మేం అలా కాదు. నేను ఎంపీగా కేవలం హిందూ ఓటు బ్యాంక్‌ ద్వారానే గెలిచానని గల్లా ఎగిరేసి చెప్తున్నా. తెలంగాణ వ్యాప్తంగా హిందూ ఓట్‌ బ్యాంక్‌ తయారు చేస్తాం. హిందువులను సంఘటితం చేస్తాం. రోహింగ్యాలంతా 2014 కంటే ముందే వచ్చారు'' అని అన్నారు. అక్రమ ఓట్ల గురించి కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారని, మళ్లీ పోటీ చేసి గెలిచే సత్తా వారికి ఉందా? అని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.

తాను 30 ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా ఉన్నానని, వార్డు మెంబరుగా గెలవని వారికి ఓట్ల గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు రోడ్లపైకి వస్తే రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని బండి సంజయ్‌ అన్నారు. ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న దుష్ప్రచారం ప్రజలను అవమానించడమేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనా పగ్గాలనే చేపట్టిన తర్వాత పంచాయతీలకు ఒక్క పైసా అయినా ఇచ్చిందా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేంద్రం నిధుల కోసమే కాంగ్రెస్‌ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. కాంగ్రెస్‌ నేతలు రాత్రి పూట యాత్రలు చేస్తున్నారని, అదేంటో తనకు అర్థం కావడం లేదన్నారు.

Next Story