జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

జగిత్యాల: కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

By అంజి  Published on  24 April 2023 4:54 AM
road accident ,Jagtial, Dammaiahpet

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

జగిత్యాల: కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిద్దరు ప్రయాణిస్తున్న బైక్‌ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తిర్మలాపూర్‌కు చెందిన పిట్టల రాజేందర్‌(18), కొడిమ్యాల మండలం సండ్రలపల్లికి చెందిన పెంకాసుల అక్షయ్‌(19) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేందర్, అక్షయ్‌లు పెద్దమ్మ బోనాల పండుగకు హాజరయ్యేందుకు దమ్మయ్యపేటలోని తమ స్నేహితుడి ఇంటికి వెళ్లారు. స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అక్షయ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేందర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచాడు. అక్షయ్ ఇటీవల డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరు కాగా, రాజేందర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.

Next Story