హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆసిఫ్‌ను స్కూటీపై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో ఆయన గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలైన ఆసిఫ్‌ను వెంటనే హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.
అక్కడ అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. యువకుడు పోలీసులకు చిక్కకుండా పారిపోయే క్రమంలో కానిస్టేబుల్‌ను ఢీకొట్టినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఘటనకు కారణమైన యువకుడిని విశాల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.