తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు ఘటనల్లో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టారు. మెదక్‌లోని నర్సాపూర్‌కు చెందిన మండల వ్యవసాయ అధికారి బి.అనిల్‌కుమార్, బోధన్ మండలం సాలూర క్యాంపుకు చెందిన ఓ వ్యాపారి అర్జీని ప్రాసెస్ చేసేందుకు ఏకంగా రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. కరెక్ట్ గా అతడు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అనిల్ కుమార్ షాక్ అయ్యాడు. లంచం మొత్తాన్ని అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షలో పాజిటివ్ అని తేలాక.. ఏసీబీ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు అనిల్ కుమార్‌ను హాజరుపరిచారు.
గురువారం నాడు కూడా ఇదే తరహాలో అశ్వారావుపేటలోని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ దారవత్ శరత్‌కుమార్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటును వేగవంతం చేసేందుకు కొనకళ్ల ఆదిత్య అనే వ్యక్తి నుంచి రూ.1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేస్తున్న అధికారులకు సంబంధించిన సమాచారం అందించడం కోసం ఏసీబీ హాట్‌లైన్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలను కోరింది.