శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టుకు వెళ్లారు.. వీడియో రికార్డు చేస్తూ ఉండగా..

శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు వద్ద నీళ్లలో పడి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి,

By అంజి  Published on  19 May 2023 5:15 AM GMT
Nizamabad, Sri Ramsagar project, Selfie video, Telangana

శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టుకు వెళ్లారు.. వీడియో రికార్డు చేస్తూ ఉండగా..

శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు వద్ద నీళ్లలో పడి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి, ఓ టీనేజర్ ప్రాణాలను కోల్పోయారు. అందుకు సెల్ఫీ వీడియో కారణమని అంటున్నారు. ప్రాజెక్టు గేట్లు క‌నిపించేలా గోదావ‌రి ప‌రివాక ప్రాంతాల‌ని వెళ్లి సెల్పీ దిగే సమయంలో కాలు జారి నీటిలో ప‌డి పోయాడు. ప‌డిపోయిన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లి మ‌రొకరు అదే నీటిలో మునిగిపోయారు. మ‌రో యువ‌కుడు అరుపులు, కేకలు వేయ‌డంతో స్థానికులు వ‌చ్చి ఇద్ద‌రి మృతదేహాలను బ‌య‌ట‌కు తీసారు.

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగ‌ర్ ప్రాజెక్టు, గోదావ‌రి న‌దిని చూసేందుకు నిర్మ‌ల్ పట్టణం చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఫహీం (32) వెళ్ళారు. వృత్తి రీత్యా బైక్ మెకానిక్ గా జీవ‌నం సాగిస్తున్న ఫ‌హీంకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బంధువుల కుమారుడైన అబ్దుల్ బరక్ (16) ఫ‌హిం ఇంటికి వచ్చాడు. ఫహీం, అతడి కొడుకు సాహిద్, బంధువు బ‌ర‌క్ క‌లిసి శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌చ్చారు. వరద గేట్ల దిగువన నీటినిల్వ ఉన్న ప్రాంతంలో అబ్దుల్ బరక్ సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయాడు. బ‌ర‌క్ ను గమనించిన ఫహీం కాపాడేందుకు నీటిలోకి దిగాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు బ‌య‌ట‌కు రాలేదు. సాహిద్ కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఈతగాళ్లు నీటిలో దిగి వారిద్దరి కోసం గాలించారు. అప్ప‌టికే వారు మృతి చెందారు. వారి మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నారు.

Next Story