హైదరాబాద్: ఈ తెల్లవారుజామున మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఇవాళ ఉదయం 5 గంటలకు మెట్‌పల్లి డిపో ఆర్టీసీ బస్సు వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లోని నలుగురికి గాయాలయ్యాయి.   
ఇదిలా ఉంటే.. ఏపీలోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను లింగపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. నిన్న చేవెళ్ల బస్సు ప్రమాదం.. అంతకుముందు కర్నూలు బస్సు ప్రమాద ఘటనలు ప్రయాణికులకు భయాందోళనలను కలిగిస్తున్నాయి.