కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చర్యతో మావోయిస్టులకు భారీ షాక్ తగులుతోంది. దీంతో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యులు వరుసగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇవాళ సాయంత్రం రామగుండం సీపీ ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్న, ఆత్ర అరుణ లొంగిపోనున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్‌గా ఆత్రం లచ్చన్న కొనసాగుతుండగా.. బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ ఉన్నారు.
కాగా ఒక సంవత్సరంలో 357 మంది నక్సలైట్లు హతమయ్యారని నక్సలైట్ల కేంద్ర కమిటీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. మరణించిన నక్సలైట్లలో 136 మంది మహిళలు ఉన్నారు. మరణించిన నక్సలైట్లలో 4 మంది CC సభ్యులు మరియు 15 మంది రాష్ట్ర కమిటీ నక్సలైట్లు ఉన్నారు.