పోలీస్‌ స్టేషన్‌లో గన్‌ మిస్‌ఫైర్‌.. గొంతు నుంచి తల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

TSSP constable's condition critical after gun misfire during duty. ఆదిలాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. తెల్లవారుజామున

By అంజి  Published on  8 Nov 2022 11:24 AM IST
పోలీస్‌ స్టేషన్‌లో గన్‌ మిస్‌ఫైర్‌.. గొంతు నుంచి తల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

ఆదిలాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. తెల్లవారుజామున 4.55 గంటల ప్రాంతంలో టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్ రజినీ కుమార్ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో బుల్లెట్ అతని గొంతు నుండి తలలోకి దూసుకు వెళ్లింది. కౌటాలలోని కొమురంభీం ఆసిఫాబాద్‌ స్టేషన్‌ ఆవరణలో తెల్లవారుజామున 3 గంటల నుంచి విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో గన్‌ పేలిన సౌండ్‌ వినబడింది. వెంటనే ఇతర సిబ్బంది కానిస్టేబుల్‌ను హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే రజినీ కుమార్ ఆత్మహత్యకు యత్నించాడా? లేక గరంం మిస్ ఫైర్ అయ్యిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ కె.సురేష్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం కానిస్టేబుల్‌ను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. గన్‌ పేలడంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Next Story