త్వ‌ర‌లో వినియోగదారుల ఇంటిముంగిట్లోకే టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు

TSRTC will now deliver pick up parcels from your doorsteps.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ఆర్టీసీ) కార్గో, పార్శిల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2022 6:29 AM GMT
త్వ‌ర‌లో వినియోగదారుల ఇంటిముంగిట్లోకే టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ఆర్టీసీ) కార్గో, పార్శిల్ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హోం డెలివ‌రీ సేవ‌ల‌తో పాటు హోం పిక‌ప్ స‌ర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 97 బస్ డిపోలు, 177 బస్ స్టేషన్ల విస్తృత నెట్‌వర్క్‌తో ఇది సాధ్యమైంద‌వుతుంద‌న్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని న‌లుమూల‌ల‌కు బ‌స్సులు తిరుగుతాయ‌ని, 33 జిల్లాల‌కు న‌గ‌రం నుంచి బ‌స్సులు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. దీంతో కార్గో, పార్శిల్స్‌ల‌ను చేర‌వేసేందు మెరుగైన ర‌వాణా స‌దుపాయం ఉంద‌న్నారు. అయితే.. మొద‌టి, చివ‌రి క‌నెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

వినియోగ‌‌దారుల ఇంటి వ‌‌ద్దకే పార్శిల్‌‌ సేవ‌‌లు అందించే దిశ‌‌లో ప్రతిపాద‌‌న‌‌ల్ని రూపొందించినట్లు తెలిపారు. ఆర్టీసీతో చేతులు క‌‌లిపేందుకు ఆస‌‌క్తి ఉన్న ఏ సంస్థలైన ముందుకు రావొచ్చన్నారు. వారి బిజినెస్ వివ‌‌రాల‌‌ను splofficertsrtc@gmail.comకు పంపాలని వారు కోరారు. వివరాలకు ఈ నెల 27లోపు 91541 97752 కు కాల్ చేయాలని సూచించారు.

Next Story