బస్ స్టేషన్లలో క్యాంటీన్లు, స్టాల్స్ నడపాలనుకుంటున్నారా?.. టెండర్లను ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ

టీఎస్‌ఆర్‌టీసీ ఇంధన విక్రయ కేంద్రాలు, స్టాళ్లు, పార్కింగ్‌ స్థలాలు, లాజిస్టిక్‌ సేవలు తదితర వాణిజ్య ఒప్పందాల కోసం ఆసక్తిగల వ్యక్తుల నుంచి టెండర్లను ప్రకటించింది.

By అంజి
Published on : 24 Dec 2023 12:29 PM IST

TSRTC tender, canteens,  Telangana, bus stations

బస్ స్టేషన్లలో క్యాంటీన్లు, స్టాల్స్ నడపాలనుకుంటున్నారా?.. టెండర్లను ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఇంధన విక్రయ కేంద్రాలు, స్టాళ్లు, పార్కింగ్‌ స్థలాలు, లాజిస్టిక్‌ సేవలు తదితర వాణిజ్య ఒప్పందాల కోసం ఆసక్తిగల వ్యక్తుల నుంచి టెండర్లను ప్రకటించింది.

టీఎస్‌ఆర్టీసీ టెండర్ నోటీసు

కింది వాటి కోసం కాంట్రాక్టర్లు/లైసెన్సీల నియామకం కోసం ఆసక్తిగల పార్టీలు/ఏజెన్సీల నుండి టెండర్లు ఆహ్వానించబడ్డాయి:

1. ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి, సికింద్రాబాద్‌, వరంగల్‌ రీజియన్లలోని వివిధ బస్‌ స్టేషన్లలో, హైదరాబాద్‌లోని తార్నాక ఆస్పత్రిలో ఖాళీ షాపులు/ స్థలాలు/ క్యాంటీన్‌/ పార్కింగు స్థలాల నిర్వహణ కొరకు,

2. తెలంగాణలోని 33 స్థలాలలో పెట్రోలు బంకులు నెలకొల్పుటకు, నడుపుట కొరకు సర్వీస్‌ ప్రొవైడర్ల నియామకానికి,

3. మహబూబ్‌నగర్‌, నల్గొండ రీజియన్లలోని బస్‌ డిపోలు/ బస్‌ స్టేషన్లలో లాజిస్టిక్స్‌ సర్వీసెస్‌ నిర్వహణ కొరకు,

4. మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి రీజియన్ల లోని బస్‌ డిపోలు/ బస్‌ స్టేసన్లతో పాటు జోనల్‌ వర్క్‌షాప్‌, ఉప్పల్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా వివిధ రకాల విధులు నిర్వహించుట కొరకు టీఎస్‌ఆర్టీసీ టెండర్లను ప్రకటించింది.

పూర్తి వివరాలు/ టెండరు ప్రకటన కొరకు http://tsrtc.telangana.gov.in(tenders)ను విజిట్‌ చేయండి. ఆన్‌లైన్‌ ద్వారా టెండర్‌లో పాల్గొనుటకు http://tender.telangana.gov.inను చూడండి.

Next Story