TSRTC: 16 ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం

హైదరాబాద్‌: ప్రయాణికుల విషయమై తెలంగాణ రాష్ట్ర రోడ్డు అండ్‌ రవాణా సంస్థ మరో ముందడుగు వేసింది.

By అంజి  Published on  27 March 2023 5:39 AM GMT
TSRTC, AC sleeper buses, Puvvada Ajay kumar

TSRTC: 16 ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం

హైదరాబాద్‌: ప్రయాణికుల విషయమై తెలంగాణ రాష్ట్ర రోడ్డు అండ్‌ రవాణా సంస్థ మరో ముందడుగు వేసింది. ఉచిత వైఫై ఏసీ స్లీపర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ మొదటిసారిగా ప్రారంభించింది. హైటెక్ ఫీచర్లతో కూడిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌.. ఎల్బీనగర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ఇటీవల 12 నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బస్సుల మాదిరిగానే.. ఏసీ స్లీపర్‌ బస్సులకు 'లహరి- అమ్మ ఒడి అనుభూతి'గా టీఎస్‌ఆర్టీసీ నామకరణం చేసింది.

ఉచిత వైఫై సౌకర్యంతో పాటు, హైటెక్‌ హంగులతో వచ్చిన ఈ 16 ఏసీ స్లీపర్‌ బస్సులు.. నేటి నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు, హుబ్బళ్లి మార్గాల్లో ఈ బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. ఈ బస్సుల్లో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఈ బ‌స్సుల పొడ‌వు 12 మీటర్లు కాగా.. 15 లోయ‌ర్‌, 15 అప్ప‌ర్‌ బెర్త్‌లతో క‌లిపి 30 బెర్త్‌ల సామ‌ర్థ్యం క‌లిగి ఉన్నాయి. వాటర్ బాటిల్ సౌకర్యం, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ ల్యాంప్స్ మరియు ఉచిత Wi-Fi వంటి అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలు ఉన్నాయి.

Next Story