టీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త.. 16 ఏసీ స్లీపర్ బస్సులు
టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో తొలిసారిగా హైటెక్ ఫీచర్లతో కూడిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది
By తోట వంశీ కుమార్ Published on 26 March 2023 1:01 PM ISTటీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) రాష్ట్రంలో తొలిసారిగా హైటెక్ ఫీచర్లతో కూడిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.ఈ కొత్త బస్సులు ప్రైవేట్ బస్సులకు పోటీగా మరియు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణీకులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేలా రూపొందించారు. 'లహరి-అమ్మఒడి అనుభవం' పేరుతో ఈ బస్సులను ప్రారంభిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లోని విజయవాడ రూట్‌లో మార్చి 27 సోమవారం ఉదయం 9:30 గంటలకు కొత్త ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ట్విట్టర్‌లో తెలిపారు.
ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 26, 2023
బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses pic.twitter.com/WBrFy37xmt
ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇతర ఉన్నతాధికారులతో సహా ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
ప్రత్యేకలు..
- ఏసీ స్లీపర్ బస్సులు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి అత్యాధునిక సౌకర్యాలు మరియు సాంకేతికతను కలిగి ఉంటాయి.
- ఈ బస్సుల పొడవు 12 మీటర్లు కాగా.. 15 లోయర్, 15 అప్పర్ బెర్త్‌లతో కలిపి 30 బెర్త్‌ల సామర్థ్యం కలిగి ఉన్నాయి
- వాటర్ బాటిల్ సౌకర్యం, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ ల్యాంప్స్ మరియు ఉచిత Wi-Fi వంటి అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలు ఉన్నాయి.
-బస్సుల్లో గమ్యస్థానాల వివరాలను చూపించేందుకు ముందు, వెనుక భాగంలో ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను అమర్చారు.
భద్రతా చర్యలు..
కొత్త ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు.
-బస్సులు TSRTC కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించబడి ఉంటాయి. ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బటన్ సౌకర్యాలను కలిగి ఉంటాయి.
-ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో లేదా ఏదైన సమస్య ఎదురైనప్పుడు పానిక్ బటన్‌ను ఉపయోగించవచ్చు. మరుక్షణమే TSRTC కంట్రోల్ రూమ్ తక్షణమే అవసరమైన చర్యలను తీసుకుంటుంది.
-బస్సుల్లో భద్రతా చర్యల కోసం సెక్యూరిటీ మరియు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరాలు కూడా ఉన్నాయి.
-బస్సులలో ఫైర్ డిటెక్షన్ మరియు అలారం సిస్టమ్ (ఎఫ్‌డిఎఎస్) ఏర్పాటు చేయబడింది. ఇది అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు మరియు అధికారులను వెంటనే అప్రమత్తం చేస్తుంది.
TSRTC ఇటీవల 630 సూపర్ లగ్జరీ బస్సులు, 8 నాన్-ఎసి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు మరియు 4 నాన్-ఎసి స్లీపర్ బస్సులను ప్రయాణికులకు మెరుగైన మరియు నాణ్యమైన సేవలను అందించడానికి ప్రారంభించింది.
ఈ కొత్త AC స్లీపర్ బస్సుల ప్రారంభంతో TSRTC మరింత మంది ప్రజలకు చేరువ కానుంది. ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.