కర్ణాటకకు బస్సు సర్వీసులను పెంచిన టీఎస్‌ఆర్టీసీ

తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడం, అంతర్-రాష్ట్ర కనెక్టివిటీని బలోపేతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

By అంజి  Published on  7 May 2023 4:45 AM GMT
TSRTC, bus services, Karnataka, VC Sajjanar

కర్ణాటకకు బస్సు సర్వీసులను పెంచిన టీఎస్‌ఆర్టీసీ

హైదరాబాద్: తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడం, అంతర్-రాష్ట్ర కనెక్టివిటీని బలోపేతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కర్ణాటకలోని హుబ్బల్లి, బెంగళూరు, దావణగెరెలకు ఎయిర్ కండిషన్డ్ (AC) స్లీపర్, సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో వ్యాపార, వ్యక్తిగత కారణాలతో నిత్యం ప్రజలు ప్రయాణాలు చేయడం, ప్రైవేట్‌ ఆపరేటర్ల బస్సుల్లో అధిక ధరలకు వెళ్లడం వల్ల ఈ ప్రాంతాలకు ట్రాఫిక్‌ రద్దీ ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.

ఈ మార్గాల్లో కొన్నింటిలో రాష్ట్ర-బస్సు సర్వీసులు అంతగా లేవు, వీటిని కార్పొరేషన్ మెరుగైన ఫ్లీట్‌తో సరిచేయాలని, ప్రైవేట్ ట్రావెల్స్‌తో సమానంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన బస్సులను మోహరించాలని ఆర్టీసీ చూస్తోంది. టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ.. తెలంగాణ నుండి కర్ణాటకకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కార్పొరేషన్ కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించిందని, రెండు రాష్ట్రాల బస్సు వినియోగదారులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తెలంగాణ ఆర్టీసీ.. హైదరాబాద్, హుబ్బల్లి నుండి లహరి ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ (పుష్‌బ్యాక్‌తో కూడిన నాన్ AC సీటర్) బస్సులను ప్రారంభించింది. “హైదరాబాద్, హుబ్బల్లి మధ్య లహరి ఏసీ బస్సులో డైనమిక్ ధరలను కూడా టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. రద్దీ లేని రోజుల్లో ధరలు తక్కువగా ఉంటాయి. వారాంతాల్లో ధరలు మరింతగా ఉంటాయి'' అని సజ్జనార్‌ తెలిపారు.

Next Story