ఓటర్ల కోసం.. ఏపీకి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

By అంజి  Published on  12 May 2024 11:45 AM GMT
TSRTC, busses, voters, Andhra Pradesh

ఓటర్ల కోసం.. ఏపీకి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్‌-విజయవాడ రూట్‌ లో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టడం జరిగిందని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఆయా బస్సుల్లో దాదాపు ౩ వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ రూట్‌ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సంస్థ కోరింది.

టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ కోసం http://tsrtconline.in వెబ్‌ సైట్‌ ని సంప్రదించాలని తెలిపింది. అలాగే, హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కోరింది.

Next Story