సంక్రాంతికి స్వ‌గ్రామాల‌కు వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.. టికెట్ పై 10 శాతం రాయితీ

TSRTC Announced 10 percent Discount on advance bookingసంక్రాంతి పండుగ‌కు స్వ‌గ్రామాల‌కు వెళ్లే ప్ర‌యాణీకుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2022 4:08 AM GMT
సంక్రాంతికి స్వ‌గ్రామాల‌కు వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.. టికెట్ పై 10 శాతం రాయితీ

సంక్రాంతి పండుగ‌కు స్వ‌గ్రామాల‌కు వెళ్లే ప్ర‌యాణీకుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది. ఓ వైపు ప్రైవేటు ట్రావెల్స్ పండుగ‌కు ఛార్జీలు పెంచేందుకు స‌మాయ‌త్తం అవుతుండ‌గా తాము మాత్రం మాత్రం చార్జీలు పెంచ‌మ‌ని, ప్ర‌త్యేక బ‌స్సుల్లో సైతం సాధార‌ణ చార్జీలే ఉంటాయ‌ని టీఎస్ ఆర్టీసీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అడ్వాన్స్‌డ్‌ టికెట్ల రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం సైతం క‌ల్పించింది.

తాజాగా మ‌రో బంప‌ర్ బొనాంజా ప్ర‌క‌టించింది. స్వ‌గ్రామాల‌కు వెళ్లే ప్ర‌యాణీకులు టికెట్ బుకింగ్ చేసుకున్న‌ప్పుడే తిరుగు ప్ర‌యాణం కూడా బుక్ చేసుకుంటే ఆ టికెట్‌పై 10 శాతం రాయితీ క‌ల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ చెప్పింది. ఈ ఆఫ‌ర్ కేవ‌లం పండుగ ముగియ‌గానే పూర్తి అవుతుంద‌ని అనుకుంటున్నారా..? కాదండి బాబోయ్‌.. జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ఆఫ‌ర్ ఉంటుంద‌ని తెలిపింది. అయితే.. ఈ ఆఫ‌ర్‌ను డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ, రాజ‌ధాని, గరుడ ప్ల‌స్ బ‌స్సుల్లో మాత్ర‌మే క‌ల్పించారు.

ప్ర‌యాణికుల ర‌వాణా ఖ‌ర్చుల‌ను దృష్టిలో ఉంచుకొని.. 10 శాతం డిస్కౌంట్ క‌ల్పించిన‌ట్లు ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఎండీ సజ్జ‌నార్ లు తెలిపారు. మ‌రిన్ని వివ‌రాల కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలని సూచించారు.

Next Story