వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
TS Minister sabita indrareddy help to injured person
By అంజి Published on 3 Dec 2021 9:26 AM GMT
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడిని తన కాన్వాయ్‌లోని పోలీసు వాహనంలోని ఆస్పత్రికి తరలించేలా చూశారు. వికారాబాద్ డెంటల్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి ఘటనా స్థలికి వెళ్లారు.
ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని తన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న మంత్రి సబితను స్థానికులు ప్రశంసిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవను అందరూ అభినందించారు. ఇలాంటి ఘటనలు ఇతరుల్లో స్ఫూర్తి నింపుతాయని పలువురు అంటున్నారు.