తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్టియర్ పరీక్షకు హాజరైన వారిలో కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. ఈ క్రమంలో ఓ ఇంటర్ విద్యార్థి నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఆ విద్యార్థి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలపడంతో పాటు తన చావుకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రరెడ్డి కారణం అంటూ ట్వీట్ చేశాడు.
'నేను నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యా. ఏదీ రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫెయిల్ చేశారు. నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబోతున్న నా చావుకు మత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కారణం' అంటూ గణేష్ అనే విద్యార్థి ట్వీట్ చేశాడు. మంత్రులను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు విద్యార్థి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే.. కాసేపటి తరువాత సదరు విద్యార్థి తాను బాగానే ఉన్నానని ట్వీట్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తన నిర్ణయాన్ని మార్చుకున్నానని.. తనను మోటివేట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.