నేడే తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు

TS Inter First Year Result 2021 likely to release today.తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2021 7:57 AM IST
నేడే తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు ఎప్పుడు విడుద‌ల కానున్నాయనే దానిపై అంద‌రిలో సందిగ్ధం నెల‌కొంది. అక్టోబ‌ర్ 25,2001 నుంచి న‌వంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు నిర్వ‌హించిన ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను డిసెంబ‌ర్ 15న(నిన్న‌) విడుదల చేయ‌నున్న‌ట్లు తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ తెలిపింది. అయితే.. కొన్ని అనివార్య కార‌ణాల వల్ల ఫ‌లితాలు విడుద‌ల కాలేదు. అయితే.. నేడు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఫ‌లితాల‌ను ఇంట‌ర్ బోర్డ్ అఫిష‌య‌ల్ వెబ్‌సైట్‌లో tsbie.cgg.gov.in విడుదల చేస్తారు. ఫ‌లితాలు విడుద‌లైన త‌రువాత విద్యార్థులు పై వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. రూల్‌నెంబ‌ర్‌, పుట్టిన తేదీ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. అనంత‌రం స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో విద్యార్థులు ఏ ఫ‌రీక్ష‌లో ఎన్ని మార్కులు సాధించారో వంటి వివ‌రాలు ఉంటాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఒకేసారి సైట్‌లోకి వెళ్లి ఫ‌లితాల కోసం అన్వేషిస్తే.. స‌ర్వ‌ర్లు బిజీ అయిపోయాయి. క‌నుక results.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా విద్యార్థులు త‌మ ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు.

Next Story