సీఎం కేసీఆర్ కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) కార్యాలయ భూ కేటాయింపుకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి.
జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు భూ కేటాయింపులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాఖ్యంపై నేడు(గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో 4,935 గజాలు కేటాయించారు. అత్యంత ఖరీదైన ఈ భూమిని రూ.100 కే గజం చొప్పున కేటాయించినట్లు పిటిషనర్ హైకోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే తరహాలో భూమిని కేటాయించారని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డితో పాటు సీఎస్, సీసీఎల్ఏ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు నోటిసులు జారీ చేసింది హైకోర్టు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.