తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు

TS GOVT has assigned additional collectors to the districts.తెలంగాణ రాష్ట్రంలో వ‌రుస‌గా ఐపీఎస్‌, ఐఏఎస్, అద‌నపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 12:08 PM IST
తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రంలో వ‌రుస‌గా ఐపీఎస్‌, ఐఏఎస్, అద‌నపు క‌లెక్ట‌ర్ హోదా, నాన్ కేడ‌ర్ అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం, వేయిటింగ్ లో ఉన్న వారికి పోస్టింగులు ఇవ్వ‌డం జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల‌కు అద‌న‌పు క‌లెక్ట‌ర్ల‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.

నారాయణ్‌పేట్‌ అదనపు కలెక్టర్‌గా జి.పద్మజారాణి, జగిత్యాల అద‌న‌పు కలెక్టర్‌గా బీఎస్ లత, రాజ‌న్న సిరిసిల్లా అద‌న‌పు కలెక్టర్‌గా ఖీమానాయక్‌కు పోస్టింగ్‌లను రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది. అలాగే వ‌రంగ‌ల్ అద‌న‌పు కలెక్టర్‌గా కె శ్రీ‌వాస్తవ, ములుగు అద‌న‌పు కలెక్టర్‌గా గా వై వి గ‌ణేష్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అద‌న‌పు కలెక్టర్‌గా ఎం డేవిడ్ ల‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ గా ఉన్న పీ.శ్రీనివాస్ రెడ్డిని.. సిద్ధిపేటకు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్ ను కామారెడ్డి అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు. చంచ‌ల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్‌కుమార్‌తో పాటు హైద‌రాబాద్ జిల్లా భూపరిరక్షణ ఎన్డీసీగా బీ. సంతోషిని లను నియ‌మించింది. వీరితో పాటు ప‌లువురు నాన్ కేడ‌ర్ అధికారుల‌ను కూడా ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.

Next Story