బిగ్ బ్రేకింగ్‌.. తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ..

Night curfew in Telangana, TS Government.తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 30 వ‌ర‌కు రాష్ట్రంలో రాత్రి క‌ర్ఫ్యూని విధించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2021 6:25 AM GMT
Night curfew in Telangana

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 30 వ‌ర‌కు రాష్ట్రంలో రాత్రి క‌ర్ఫ్యూని విధించింది. రాత్రి 9 నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌లకు మిన‌హాయింపు నిచ్చారు. రాత్రి 8 గంట‌ల‌కే కార్యాల‌యాలు, షాపులు, హోట‌ళ్లు మూసివేయాని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. తెలంగాణ‌లో రాత్రి క‌ర్ఫ్యూ, వారంత‌పు లాక్‌డౌన్‌పై 48 గంట‌ల్లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని రాష్ట్ర హైకోర్టు సోమ‌వారం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోక‌పోతే త‌గిన ఆదేశాలు ఇస్తామ‌ని హెచ్చ‌రించింది.

మంగ‌ళ‌వారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,22,143 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 5,926 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. నిన్న ఒక్క రోజే 18 మంది మృత్యువాత ప‌డ‌గా.. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,856కి చేరింది. నిన్న‌ 2,209 మంది బాధితులు కోలుకోగా.. మొత్తంగా ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,16,650 మందికి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 87.62 శాతం, మరణాల రేటు 0.51శాతం ఉందని పేర్కొంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 793 కేసులు న‌మోదు అయ్యాయి.




Next Story