తెలంగాణలో 6 నుంచి ఎంసెట్ చివరి విడుత కౌన్సెలింగ్
TS Eamcet 2021 final phase counselling schedule released.తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు
By తోట వంశీ కుమార్ Published on 3 Nov 2021 2:22 PM ISTతెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. నవంబర్ 6 నుంచి ఎంసెట్ రెండో విడుత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. హైకోర్టు అనుమతి ద్వారా వచ్చిన 5,770 కొత్త సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. వీటిని అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90వేల ఇంజినీరింగ్ సీట్లు ఉండగా.. తొలి దశ కౌన్సెలింగ్‌లో 78,270 సీట్లను భర్తీ చేయగా.. 61,169 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. మొత్తంగా 46,322 సీట్లు మిగిలిపోయాయి. ఈ ఖాళీలను 6వ తేదీ నుంచి భర్తీ చేయనున్నారు. కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పేమెంట్‌కు రూ.73,50,92,604 మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
తెలంగాణ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్..
- ఈ నెల 6,7 తేదీల్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడంతో పాటు స్లాట్ బుకింగ్ కు అవకాశం
- ఈ నెల 8న స్లాట్ బుకింగ్ చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్
- ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు
- ఈ నెల 12న సీట్ల కేటాయింపు ఉంటుంది.
- ఈ నెల 12 నుంచి 15 వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించడంతో పాటు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి
- సీటు పొందిన కాలేజీల్లో అభ్యర్థులు ఈ నెల 12 నుంచి 16 వరకు రిపోర్టింగ్ చేయాలి.
- ఈ నెల 18న ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో సీటు సాధించిన అభ్యర్థులు రద్దు చేసుకునేందుకు అవకాశం
ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్..
- వెబ్ ఆప్షన్స్ 20,21 తేదీల్లో
- సీట్ల కేటాయింపు 24వ తేదీ
- సెల్ఫ్ రిపోర్టింగ్ 24 నుంచి 26 తేదీల్లో
- కాలేజీలో రిపోర్టింగ్ 26-11-2021
-స్పెషల్ రౌండ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు వాటిని రద్దు చేసుకునేందుకు ఈ నెల 26న అవకాశం ఉంటుంది.
- బీ ఫార్మసీ స్పాట్ అడ్మిషన్ 25-11-2021