కేసీఆర్‌ కోసం ప్రత్యేక విమానం.. కొనుగోలు చేయనున్న టీఆర్‌ఎస్‌

TRS to buy special flight to KCR for nationwide tour. దసరా పండుగ రోజున (అక్టోబర్ 5) జాతీయ రాజకీయ పార్టీ పేరును ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ

By అంజి  Published on  30 Sep 2022 7:24 AM GMT
కేసీఆర్‌ కోసం ప్రత్యేక విమానం.. కొనుగోలు చేయనున్న టీఆర్‌ఎస్‌

దసరా పండుగ రోజున (అక్టోబర్ 5) జాతీయ రాజకీయ పార్టీ పేరును ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో టీఆర్‌ఎస్ అధిష్టానం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్‌ దేశ వ్యాప్త పర్యటనలో కోసం ఓ చిన్న విమానాన్ని కొనుగోలు చేయనున్నారు. రూ.80 కోట్లు వెచ్చించి 12 సీట్ల ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ కోసం కేసీఆర్ రాజకీయ పార్టీని ప్రారంభించే రోజున ఆర్డర్‌ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. జాతీయ పార్టీ పేరు ప్రకటన తర్వాత విమానం ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం.

2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలను బహిర్గతం చేయడానికి టిఆర్‌ఎస్ అధినేత దేశవ్యాప్త పర్యటన కోసం ఈ విమానాన్ని విస్తృతంగా ఉపయోగించనున్నారు. పార్టీ ఫండ్‌ని ఉపయోగించకుండా విరాళాలతో విమానాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పార్టీ ఖజానాలో రూ. 865 కోట్ల నిధులు ఉన్నాయి. ప్రస్తుతం కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విమానాలను అద్దెకు తీసుకుంటున్నారు. కొత్త జాతీయ పార్టీని స్థాపించే నేప‌థ్యంలో సొంత విమానం కావాల‌ని టీఆర్ఎస్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది.

ఈ క్రమంలోనే విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నేతలు పోటీపడుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సొంతంగా విమానం ఉన్న రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా రికార్డ్‌ సృష్టిస్తుంది. దసరా రోజు (అక్టోబర్ 5) టీఆర్‌ఎస్ శాసనసభలో కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీకి కొత్త పేరును వెల్లడించనున్నారు. దానిని జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెడతారు. కొత్త జాతీయ పార్టీ పేరును వెల్లడించిన తర్వాత పార్టీ ప్రత్యేకమైన జెట్ కొనుగోలు కోసం ఆర్డర్ చేయనుంది.

Next Story