టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు. తాను సీఎం కేసీఆర్‌ అభిమానాన్ని, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యానని, ఇలాంటి పరిస్థితులలో పార్టీలో కొనసాగడం కరెక్ట్‌ కాదని భావించానని లేఖలో గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనను గౌరవించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. గట్టు రామచంద్రరావు వైసీపీ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత పార్టీ నుండి ఎమ్మెల్సీతో పాటు పలు పదవులను ఆశించి నిరాన చెందారు. తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రామచంద్రరావు తన భవిష్యత్‌ కార్యచరణను మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీనిపై టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story