చదువుల తల్లి హారికకు.. ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సాయం

TRS MLC Kavitha Financial Assisatance To Mbbs Student Harika. యూట్యూబ్ వీడియోల ద్వారా క్లాసులు విని.. ఎంబీబీఎస్ సీటు సాధించిన హారికకు టీఆర్ఎస్ నాయకురాలు,

By అంజి  Published on  9 Nov 2022 10:13 AM GMT
చదువుల తల్లి హారికకు.. ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సాయం

యూట్యూబ్ వీడియోల ద్వారా క్లాసులు విని.. ఎంబీబీఎస్ సీటు సాధించిన హారికకు టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన వంతు సాయం అందించారు. ఎమ్మెల్సీ కవిత హారికకు తొలి విడత ఫీజును అందజేశారు. ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ హ్యాండిల్‌ హారికతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను పంచుకున్నారు. నిజామాబాద్ నాందేవ్ గూడ‌కు చెందిన హారిక ఎంబీబీఎస్‌ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని వార్తల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

కోర్సు పూర్తి చేయడానికి అవసరమయ్యే ఖర్చును భరిస్తానని చెప్పారు. "కలలు కనడానికి ధైర్యం చేయండి. వాటిని సాధించే వరకు పని చేయండి. ఇది యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంబీబీఎస్‌ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచిన హారిక కథ. నేను ఆమెను, ఆమె తల్లిని కలుసుకున్నాను. ఆమె కలల పట్ల నా మద్దతును అందించాను. ఆమె ఫీజు మొదటి విడతను అందజేస్తున్నాను." అని ట్విటర్‌లో కవిత రాసుకొచ్చారు. ''బీడీ కార్మికురాలైన ఒంటరి తల్లి కుమార్తె, నిజామాబాద్‌కు చెందిన హారిక తమ కలలను సాకారం చేసుకునే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం." అని అన్నారు

ఎమ్మెల్సీ కవిత అండగా నిలవటంపై హారిక కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంక్‌ను హారిక సాధించింది.


Next Story