ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితులకు ఊరట

TRS MLAs poaching case TS High Court grants bail to three accused.టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల‌కు ఊర‌ట

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 1 Dec 2022 1:18 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితులకు ఊరట

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల‌కు ఊర‌ట ల‌భించింది. ముగ్గురు నిందితుల‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ల‌కు ష‌ర‌తుల‌తో కూడి బెయిల్‌ను హైకోర్టు ఇచ్చింది. ప్ర‌తి సోమ‌వారం సిట్ ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. రూ.3ల‌క్ష‌ల పూచీక‌త్తుతో బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్ స్టేష‌న్‌లో స‌రెండ‌ర్ చేయాల‌ని తెలిపింది.

ఇదిలా ఉంటే.. రామ‌చంద్ర భార‌తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో రెండు కేసులు న‌మోదు అయ్యాయి. న‌కిలీ ఆధార్‌, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు న‌కిలీ పాస్‌పోర్టు క‌లిగి ఉన్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. హైకోర్టు బెయిల్ మంజూరు అయిన నేప‌థ్యంలో ఈ కేసుల్లో ఆయ‌న్ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. అటు నంద‌కుమార్‌పైనా బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఐదు కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story